సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో నేడు, మంగళవారం జరిగిన బీజేపీ పదాదికారుల సమావేశంలో బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి అరుణ్ సింగ్, ఇన్‌ఛార్జి సిద్ధార్ధనాధ్ సింగ్ పాల్గొన్నారు. అయితే ఇటీవల కేంద్ర బీజేపీ కేటాయించిన 6 ఎంపీ స్థానాలలో ఒక్క భీమవరం కు చెందిన వర్మ తప్ప మిగతా 5 గురు బయట పార్టీల నుండి వచ్చిన కోటీశ్వరులకు టికెట్ కేటాయించడం పట్ల… టికెట్స్ ఆశించి భంగపడ్డ బీజేపీ సీనియర్ నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జివిఎల్ నరసింహారావు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం సంచలనం రేపింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ క్యాడర్ నుద్దేశించి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఫురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ తో పొత్తు కేంద్ర బీజేపీ ఆదేశాల మేరకే జరిగిందని ఇక వాద ప్రతివాదనలకు స్థానం లేదని రాష్ట్రంలో అవినీతి, అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దెం దింపేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టే అధికారం జగన్ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు.నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలనే సీఎం జగన్.. ఆ వర్గాలకు ఏం న్యాయం? చేశారని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ఆమె త్రివేణి సంగమంతో పోల్చారు. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులతో వెళ్లాలని పార్టీ హైకమాండ్ భావించిందన్నారు.
