సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం శివారులోని పెదమిరం లోని తన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల సునీల్ కుమార్, వైసీపీ అనుకూల ఛానెల్, సోషల్ మీడియా తదితరులు తనపై చేస్తున్న ఆరోపణలు ‘అరెస్ట్’ అవుతానన్న కధనాలు ప్రచారం నిరాధారం అని, తాను ఏ తప్పు చెయ్యలేదని, బ్యాంకుల రుణాలు కేసులో సుప్రీం కోర్ట్ లో ఇంకా ఎలాంటి ఛార్జిషీటు వేయలేదన్నారు. సుప్రీం కోర్ట్ లో గతంలో తనపై వేసిన పలు కేసులలో నిర్దోషి నని తీర్పు వచ్చిన ఉదంతాలు ప్రస్తావించారు. ఈ కేసులలో కూడా తాను నిర్ధోషిగా బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.తాను ‘కూటమి’లో ఒంటరివాడినయ్యానని కధనాలు వస్తున్నాయని. అయితే, తనను తాను కాపాడుకోగలనని, తాను పందెం కోడి లాడిలాంటోనని ఒంటరి గానే బరిలోకి దిగుతానని, విజయమో ఓటమో తేల్చుకొంటానని.. అంతేకాని ఒకరి మద్దతు, సానుభూతి ఆశించే వ్యక్తిని కాదని.. గతంలో తాను ఒంటరిగానే జగన్ పాలనఫై 2020 లోనే తిరుగుబాటు చేసినప్పుడు ఎవరు అతనిని ఎదిరించే సాహసం చెయ్యలేదని, ఇంట్లో కూర్చున్నవారేనని, తానే ప్రాణాలకు తెగించి ఒక్కడిగా పోరాడి అతనిని గద్దె దింపేవరకు పోరాడానని.. అయితే తరువాత ( ఆ క్రిడిట్_ )లాగేసుకొన్నారని ?ఆ ఘటనలు గుర్తు తెచ్చుకొన్నారు. కానీ జగన్ టార్గెట్ తాను ఒక్కడినే అని తనకు తెలుసు.. జగన్ కు తెలుసునని.. అయితే, తనను తాను కాపాడుకోగలనని, తాను చదువుల్లో ఎక్కువ భాగం క్రిస్తవ విద్య సంస్థలలోనే పూర్తీ చేసానని, ఆ మతం పట్ల తనకు వ్యతిరేకభావం లేదని గౌరవం ఉందని, ప్రజలకు మంచినీరు, పొలాలకు కాలుష్యం లేని సాగునీరు అందించడానికి ఇరిగేషన్ స్థలాలలో ఆక్రమణలను తొలగించానని, వాటిలో ‘చర్చి’ తో పాటు హిందువుల గుళ్ళు, బిసిల ఇళ్ళు , రాజుల బిల్డింగ్ లు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే ప్రతిచోటా నష్టపోయినవారికి కచ్చితంగా ప్రభుత్వ సహకారం అదెలా చేస్తానని, కానీ ఆ వార్తలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, తన నిర్ణయాలతో ప్రజలకు మేలు జరిగిందని వారి కోసం కొందరిని వదులుకోవడానికి తాను సిద్దమే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *