సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఉపరాష్ట్రపతి పదవి కి సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనున్న ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఎన్టీఏ ప్రభుత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధకృష్ణన్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్‌ చేశారు. 4గురు ఎంపీలు పార్టీలు పార్టీకి రాజీనామా చేసిన సరే..ఏపీ నుండి ఇప్పటికి రాజ్యసభ లో అత్యధిక బలం 7 గురు ఎంపీలు కలిగి లోక్ సభలో 4గురు ఎంపీలు ఉన్న వైసీపీ మద్దతు చాల కీలకం కావడంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని జగన్‌ను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ కోరారు. దీనికి సమాధానంగా జగన్ తన ఎంపీలతో చర్చించి తన అభిప్రాయం తెలుపుతానని చెప్పారు. అయితే గతంలో కూడా ప్రధాని ఎన్నికపై కూడా జగన్‌కు కేంద్రం నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు తన మద్దతు ప్రధాని మోదీకి తెలుపుతున్నట్లు జగన్ ప్రకటించారు. దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోర్ ఉద్యమం ప్రారంభించిన నేపథ్యంలో గతంలోనే ఏపీలో 12 శాతం ఓట్లు అంటే 52 లక్షలు ఓట్లు ఈవీఎం లలో అధికంగా వచ్చాయని ఇంత పెద్ద స్థాయి మోసం దేశంలో ఎక్కడ జరగలేదని దర్యాప్తు చెయ్యాలని ఇటీవల ఈసీ కి వైసీపీ పిర్యాదు చేసిన నేపథ్యంలో జగన్ ఇప్పుడు ఎన్డీయే కు మద్దతు ఇస్తారా? చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *