సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయాన్ని కోరుతూ నీటిపారుదల శాఖామంత్రి రామానాయుడు ప్రచారం నిర్వహించారు. శాసనమండలిలో ఎన్డీఏ కూటమికి ఎమ్మెల్సీ ల కొరత ఉందని కాబ్బటి పేరాబత్తుల ను గెలపించవలసిన అవసరం ఉందని స్పష్టమైన మెజార్టీ ఇవ్వాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ…ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అంటూ జగన్ నిరుద్యోగులను మోసం, దగా చేశారని తమ కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీపై తొలి సంతకం చేశారని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో డీఎస్సీ విడుదల చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఉపాధ్యాయ పోస్టుల నియమకాలు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు .
