సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల జగన్ మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు 11 మంది అసెంబ్లీ సమావేశాలకు రాని కారణంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల అవమానకర వాక్యాలు చేసారని, తమ సభ్యత్వాలు రద్దు చేస్తామని ప్రకటించడం ఫై మండిపడుతూ .. గతంలో చంద్రబాబు ఏడాదిన్నర కాలం అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకున్నప్పుడు మీరు పడని సిగ్గు మేము పడాల? మీ సభ్యత్వాలు మేము రద్దు చేయలేదే ? కావాలంటే అసెంబ్లీ కి రాజీనామా చేస్తాను. నాతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు, 4 గురు ఎంపీలు కూడా రాజీనామా చేస్తాం. అని ప్రకటించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు నేడు, ఆదివారం మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఇందులో కక్ష సాధింపు ఏమి లేదని. జగన్ వైసీపీ పార్టీ అధినేతగా, ఎంపీగా, గతంలో ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చేశారని.. ఆయనకు రూల్స్ తెలియకుండా కామెంట్స్ చేస్తారా? భారత రాజ్యాంగం 190(4) ప్రకారం ఎవరైనా లీవ్ ఆఫ్ ఆక్షన్స్ అడగకుండా కంటిన్యూస్‌గా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు రాకపోతే శాసనసభ సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులు అవుతారని జగన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. మీరు అసెంబ్లీ రూల్స్‌ను చూసుకుంటే ఎవరూ ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారనేది అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలనేది ఆయా పార్టీల ఎమ్మెల్యేల బలం బట్టి సమయం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రతీ రోజూ క్వశ్చన్ అవర్‌లో రెండు ప్రశ్నలు వైసీపీ సభ్యులకు వస్తున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *