సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పడు తెలుగు రాష్ట్రాలలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ సూచించిన మావిగన్! ’ పేరుతొ రాజధాని ఫై పెద్ద చర్చ జరుగుతుంది. అంతేకాదు మచిలీపట్టణం విజయవాడ, గుంటూరు, కలిపి రాజధాని నిర్మిస్తే కేవలం 10 శాతం ఖర్చుతోనే సుమారు 50 లక్షల జనాభాతో 80 కిమీ పరిధిలోపే మహానగరం వస్తుందని జగన్ చేసిన సూచనా ఆయా నగరాలలో ప్రజలు కు ‘కొత్త ఆలోచనలు’ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త ఆశలు పెంచే మంచి అవకాశం ఇచ్చింది. జగన్ లో గన్ ఉన్నట్లే … మావిగన్! లో కూడా గన్ ఉంది. ఇప్పుడు మచిలీపట్నం (మా), విజయవాడ (వి), గుంటూరు (గన్)లను కలిపి రాజధానిగా ప్రకటించాలని… దానికి ‘మావిగన్’ అని పేరు పెట్టాలని సూచించారు. ‘ఒక గీతను చెరపకూడదు. ముట్టుకోకూడదు.. అన్నపుడు దాని ప్రక్కన దానికన్నా పెద్ద గీత గియ్యాలి’ అన్న పాత నానుడి ని జగన్ ఇప్పడు పాలో అవుతున్నారు. ఎప్పుడో 2014లో శివరామకృష్ణన్ కమిటీ ముందు చేయాల్సిన సూచనలను జగన్ ఇప్పుడు మరల తిరిగి తెరమీదకు తెచ్చారు. ఇది అతి త్వరలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె, ఎక్కుపెట్టిన జ’గన్’ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. . పోనీ… తాను అధికారంలో ఉన్నప్పుడైనా ఇలా చేశారా, అంటే అదీ లేదు. మొత్తానికి ‘మావిగన్’ అనే ఒక్క మాటతో లోక్ సభలో అమరావతి చట్టబద్దత ఆమోదం కన్నా మొత్తం సోషల్ మీడియాను జగన్ షేక్ చేశారు. రాష్ట్రాలకు ‘రాజధాని’ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడుంది?’… ఇలాంటి సవాల్ విసిరి ఒక సందేహాన్ని కూడా రాజ్యాంగ నిపుణులకు రాజకీయ విశ్లేషకులకు, మీడియా ఛానెల్స్ లో చర్చలకు మంచి పని పనికల్పించారు జగన్..
