సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గిద్దలూరులో జరిగిన టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వాలంటీర్ ఉద్యోగం ఒక్కటే ఇచ్చాడని, తాను ఐటీ ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు అన్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ గడ్డ జగన్, జగనే నమ్మకం కాదని, జగనే రాష్ట్రానికి దరిద్రమని, చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.ఇంటికి వెళ్లే ముందు విశాఖ వెళ్తానని అంటున్నాడని, జగన్ వెళ్లాల్సింది ఇడుపులపాయకు, కేసు సుప్రీం కోర్టులో ఉంటే తమ్ముడిని కాపాడుకోవడానికి సెప్టెంబర్ నెలలో విశాఖ వెళ్తానని చెబుతున్నాడని మండిపడ్డారు. జగన్ విశాఖ వెళ్తానంటే అక్కడి ప్రజలు భయపడుతున్నారని, పులివెందులలో బస్టాండ్ కట్టలేని వాడు స్టీల్ ప్లాంట్ కడతాడని, కియా మోటర్స్ తన హయాంలోనే ఏర్పాటు చేసి 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగి అందరూ గంజాయికి అలవాటుపడుతున్నారని,అన్నారు. ముఖ్యమంత్రి జగన్ జీవితమే ఫేక్ అని, మన ఇళ్లకి స్టిక్కర్లు అంటించడానికి వీళ్లు ఎవరని ప్రశ్నించారు.
