సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాటి తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ అంటే నటిగా కంటే… తెలుగు రాష్ట్రాలలో ఒక హీరో ను దర్శకుడిని ఉద్దేశించి ఆమె చేసే ట్వీట్లతో ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం అందరికి తెలిసిందే.. ఆమె అడపాదడపా చేసే ట్విట్స్ సంచలనం రేపుతుంటాయి. అయితే ఎవరు ఊహించని విధంగా తొలిసారి సీఎం జగన్ పాలన ను ప్రశంసిస్తూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుత ఎన్నికల ముంగిట సంచలనం రేపింది. ఆమె ట్వీట్ లో.. ‘కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో ఏపీ ప్రజలను కాపాడటంలో, చేనేత కార్మికులకు వైఎస్సా ర్సీపీ అండగా నిలిచింది. వారి కోసం జగన్ సర్కార్ చాలా మంచి పనులు చేసింది. చేనేత కార్మికుల సమస్య లపై క్రియాశీలకం గా పనిచేసే కార్య కర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయం ’ అని పూనమ్ కౌర్ ట్వీ ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఆమె త్వరలో ఏపీ రాజకీయాలలో వైసీపీ కి బహిరంగ మద్దతు ప్రకటిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తాడేపల్లి గూడెం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ తనను ఉద్దేశించి.. 4గురు పెళ్ళాలు అంటూ ఉంటాడని నిజానికి నాకు 3 పెళ్లిళ్లు మాత్రమే అయ్యాయని .. నా నాల్గవ పెళ్ళాం సీఎం జగన్ అని బహిరంగ వ్యాక్యలు చేసిన నేపథ్యంలో పూనమ్ కౌర్ ఇలా తొలిసారి సీఎం జగన్ ప్రశంసిస్తూ ట్వీట్ చెయ్యడం వెనుక ఎదో మతలబు ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
