సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్కన శ్రీశైలం లో పవిత్రంగా మండల దీక్ష చేసి వచ్చిన శివ భక్తులపై పోలీసులు లాఠీలతో విచక్షణ రహితంగా కొట్టిన ఘటనలుతో హిందూ భక్తుల నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. మరో ప్రక్క, ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు డిప్యూటీ సీఎం.పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూనే ఉందని అన్నారు. తనుకూడా శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి త్వరలోనే తప్పకుండా వస్తానన్నారు. జగన్ హయాంలో పలు ఆలయాల్లో అపచరాలు చాలా జరిగాయని తనదయిన శైలి లో విమర్శలు చేసారు. వైసీపీ హయాంలో పాలక మండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని పవన్ తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక అపచారాలు జరగకుండా భక్తులకు మంచి సేవలు అందిస్తున్నామని అన్నారు. శ్రీకాళహస్తి లో 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు రూ.10 కోట్ల రూపాయలుతో భక్తుల కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు
