సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మేడే సందర్భంగా నేడు,గురువారం మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి ఉపాధి శ్రామికులు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ఉపాధి పనుల ద్వారా శ్రామికులు.పేదలకు ఆసరా కలుగుతుందని చెప్పారు. తమకు స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరులో తమకు ఉన్న రెండు ఎకరాల పొలం అమ్మేసుకున్నామని గుర్తుచేశారు. తర్వాత తెలంగాణాలో ఎనిమిది ఎకరాలుకొని .. తాను వ్యవసాయం చేస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.శ్రమ , కష్టం విలువ తనకు తెలుసునని పవన్ కల్యాణ్ అన్నారు. ఉపాధి కూలీ పదం తొలగించి ఉపాధి శ్రామికులంగానే పిలుస్తామని చెప్పారు. ప్రభుత్వం, అధికారులు, మీడియా కూడా ఈ శ్రామికులు పదం వాడాలని విజ్ఞప్తి చేశారు. ఇరవై ఏళ్ల వయసులో ఏం చేయాలో తనకు తెలిసేది కాదన్నారు. ఆ తర్వాత తనవంతుగా శ్రమ ఆయుధంగా ముందుకు సాగానని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత జగన్ ప్రభుత్వానిదని, జగన్ ప్రభుత్వ హయాంలోపేదలు, శ్రామికులు కష్టాన్ని వైసీపీ ప్రభుత్వం దోచుకుని దాచుకొన్నారని, మద్యం నిషేధిస్తామన్న వారు మద్యాన్ని ఏరులై పారించారని విమర్శించారు.
