సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నేడు, బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రము లో భారీ వర్షాలు వరదలు వంటి విపత్తు వేళ కేంద్రం అన్ని విధాలా బాధిత కుటుంబాలను ఆదుకొంటుందని, రాష్ట్రము లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సమర్థవంతంగానే పని చేస్తుందని, సీఎం చంద్రబాబు వరద బాధితుల పరిస్థితిని రాత్రనక పగలనక సమీక్షిస్తున్నారని, అన్ని రాజకీయ పార్టీలు కలసి బాధితులను కాపాడాలని.. అయితే ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ హూందాగా వ్యవహరించకుండా ప్రభుత్వంపై నిందలు వేస్తుండటం మంచి పద్దతి కాదని అన్నారు. గతంలో సంక్షేమ పథకాల ముసుగులో వైసీపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేసిందని, కాబట్టే ఏపీ జనాలు 11 సీట్లతో సరిపెట్టారని అన్నారు. ఇకనైనా జగన్ తీరు మార్చుకోవాలని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక సభ్యత్వం నమోదు కోసం కృషి చేస్తున్నామని సభ్యత్వానికి యువత ముందుకు రావాలని మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
