సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ జిల్లా జగ్గంపేట గండేపల్లి శివారు జాతీయ రహదారిపై నేడు, సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి వైపు వెళ్తున్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చి వ్యాగనర్ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకుపోయిన కారు రోడ్డు ప్రక్కన సిమెంట్ డివైడర్ను బ్రద్దలు కొట్టేసి ఆగిపోయింది. కారు తుక్కు తుక్కు అయింది. ఇక కారులో ఉన్నా ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. వైజాగ్ నుంచి రాజమండ్రికి కుటుంబంతో సహా తిరిగి వస్తుండగా ఈ కారు ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి హైవే సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
