సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురు గా ఉన్న కోపల్లె వారి కాంప్లెక్సులో షాపు నెంబరు 16 లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ( జనరిక్ మందులు షాపు)ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి తోకలసి సందర్శించారు. షాపులో ప్రతి రోజు వచ్చి మందులు కొనుక్కునే ప్రజలతో వారు మాట్లాడారు. జనరిక్ మందులు మంచి క్వాలిటిగా ఉన్నాయని, బాగా పనిచేస్తున్నాయని బయట మార్కెటు కన్నా 80 శాతం డబ్బులు ఆదాయం అవుతుందని చెప్పడంతో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వర్మ మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణలో నిరుపేదలు మరియు మధ్యతరగతి వర్గాల వారికి జనరిక్ మందులు షాపు ద్వారా నాణ్యమైన మందులు కొనుగోలు ద్వారా 80 శాతం ఆదా అవుతుందన్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 15 వేల షాపులు ఉన్నాయని,మన ఆంధ్రప్రదేశ్ లో 280 షాపులు ఉన్నాయని తెలిపారు. మంచి బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసిన . కిడ్నీ, లివర్,గుండెకు,అన్ని జబ్బులకు 2050 రకాల మందులు దొరుకుతాయని.. మందులు తక్కువ ధరలకు లభించడం వలన ప్రజల్లో అపోహలు అనుమానాలు ఉన్నాయని, వీటిని తొలగించడానికి ప్రజలకు అవగాహన,చైతన్యం కలిగించిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జనరిక్ షాపులు ఏర్పాటు కొరకు నిరుద్యోగ యువత ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చని,అర్హతలను పరిశీలించి వెనువెంటనే షాపులు మంజూరు చేస్తామన్నారు.షాపులు ఏర్పాటుకు వివిధ బ్యాంకులు రుణాలు మంజూరు అవుతాయని, అమ్మకాలపై 20 శాతం కమీషను ద్వారా ఆదాయం వస్తుందన్నారు. ప్రతినెల ప్రోత్సహం కింద మరో 20 వేల రూపాయలు అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి. భానూనాయక్,జిల్లా డ్రగ్ కంట్రోలరు అధికారి షేక్ అభిత్ ఆలీ, బిజెపి భీమవరం నియోజవర్గ కన్వీనర్ కాగిత సురేంద్ర పలువురు బీజేపీ నాయకులు, పాల్గొన్నారు.
