సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఒకప్రక్క యూరప్ దేశాలలో అమెరికాతో సహా ఓమిక్రాన్ వైరస్ బారిన పడుతున్న వారిలో లక్షలాది పిల్లలు కూడా ఉండటం. మరో ప్రక్కఓమిక్రాన్ వైరస్ కేసులు ఇండియాలో కూడా పెరుగుతుండటంతో మనదేశంలో కూడా ముందస్తు చర్యలలో భాగంగా వచ్చే జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి టీకా రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సోమవారం ప్రకటించింది. కోవిన్ యాప్/వెబ్‌సైట్‌లో అర్హులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.ప్రభుత్వ గుర్తింపు కార్డులులేని వారు విద్యా సంస్థలు మంజూరు చేసిన గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో 15–18 ఏళ్ల వయసులోపు వారు 22,41,000 మంది ఉన్నారు. టీకాల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సి ఉంది
