సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రస్తుతం రేషన్ కార్డ్స్ ఫై ఒక్క బియ్యం తప్ప పంచదార కానీ, కందిపప్పు కానీ ఇవ్వడంలేదని ( సబ్సిడీలో కిలో పంచదార 17 రూ .కు. కందిపప్పు 67 రూ.కు ఇవ్వడం మానేశారు) పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలలో అసహనం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. రేషన్‌కార్డులు ఉన్నవారికి రాష్ట్రంలో పట్టణాల్లోని రేషన్ షాపుల్లో ప్రతినెలా గోధుమపిండి కిలో రూ.18 చొప్పున పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనవరి 1 నుంచి ఒక్క కేజీ గోధుమ పిండి కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. కేవలం 5 నిమిషాల్లోనే పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంటుందని తెలిపారు. పలు ప్రాంతాలలో మొంథా తుఫాను బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చక్కగా చేశామని మంత్రి అన్నారు.
