సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 7 రోజులలో రాబోయే కొత్త ఏడాది 2022 జనవరి 1 నుండి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల వేళలను సవరించారు. కొత్త సమయ వేళలు అమలులోకి వస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రయాణికులు ఈ మార్పును గమనించి కొత్త రైల్వే సమయాలను ముందుగానే తెలుసుకోవలసి ఉంది. కరోనా నిబంధనల నేపథ్యంలో కొంత కాలంగా [ప్రత్యేక రైళ్ల వేగాన్ని పెంచుతూ వస్తున్నా రైల్వే అధికారులు ఇటీవల ముఖ్యమైన రైళ్లను గరిష్ట వేగంతో నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి ప్రయాణ సమయం తగ్గింది. మరోపక్క కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వస్తుండటంతో ఎక్కువ రైళ్లను నడుపుతున్నారు. ఈ రెండు కారణాలతో తాజాగా వాటి వేళలను సవరించారు. జోన్ పరిధిలో ప్రస్తుతానికి 71 రైళ్ల వేళలను సవరిస్తూ కొత్త టైంటేబుల్‌ను విడుదల చేశారు. 10 నిమిషాల నుంచి గరిష్టంగా 30 నిమిషాల మేర వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
