సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్య క్షుడు కేతినేని సురేంద్రమోహన్ భీమవరంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ.. భీమవరం పరిసరాలలో బీజేపీ కి బలం ఉందని అలాగే ఇకపై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని దీనిలో భాగంగా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలలో గ్రామ, వార్డు, మండల కమిటీల నియామకాన్ని 10 రోజుల్లో పూర్తి చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే . జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భీమవరంలో 5కె పరుగు నిర్వహించాలన్నారు. ఫిబ్రవరిలో విజయవాడ లేదా విశాఖపట్నంలో 4వేల మంది బీజేవైఎం కార్యకర్తలతో మహాసభ నిర్వహిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా అధ్య క్షుడు తాతాజీ, యువమోర్చా జిల్లా అధ్య క్షుడు ఎ.లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నా రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *