సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చంద్ర బాబు తనయుడు తెలుగు దేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. టీడీపీ కి ఏపీలో పూర్వ వైభవం తీసుకొనిరావాలంటే పాదయాత్రే ..అధికారానికి దారి చూపిస్తుందని భావించడంతో .. 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర కు సిద్ధపడుతున్నట్లు నేడు, శుక్రవారం ప్రకటించారు. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, . మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్యూహాత్మకంగా పాదయాత్ర నిర్వహిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి,
