సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశం మొదలైంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ,భీమవరం నుండి పి ఏ సి సభ్యులు కనకరాజు సూరి ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ..ఇటీవల జనసేన పార్టీకి జనాదరణ పెరుగుతోందని,దీనిని గమనించిన వైసిపి సర్కార్ జన సైనికులను ఇబ్బందులు పెట్టేలా కుట్రలు చేస్తోందని , వేధింపులకు గురిచేస్తుందని ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఘటన రాష్ట్రం మొత్తం చూసిందని, అక్కడ వైసీపీ నాయకులు వ్యవహరించిన పద్దతి , ప్రజావాణిని విమర్శించినా తీరు… వైజాగ్ ఖాళీచేసి వెళ్లాలని ఆదేశిస్తూ ఐపీయస్ అధికారి పవన్ కళ్యాణ్ పట్ల వ్యవహరించిన తీరు ప్రజా స్వామ్య విరుద్దమన్నారు. అక్కడ అర్ధరాత్రి హోటల్లో చొరబడి మరీ జనసేన నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఘటనా స్థలంలో లేనివారిపై హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు.
