సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజ్యసభ మాజీసభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి విజయవాడలో కాంగ్రెస్ రాష్ర్ట కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..పిఠాపురం లో పవన్ ప్రసంగంలో తమ కూటమి ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీ లు గురించి మాట్లాడకుండా సొంత డబ్బా కొట్టుకోవడమే కనిపించిందని, టీడీపీని తానే నిలబెట్టినట్లు, గెలిపించడం పవన్ చెప్పడం విడ్డూరం. తాతకు మనుమడు దగ్గు నేర్పినట్లుంది పవన్ వాలకం అంటూ ఎద్దేవా చేసారు. పవన్‌ తన జనసేనను రద్దు చేసుకొని త్వరలో బీజేపీలో విలీనం చేయడం మంచిదని,మొన్నటివరకు ఏమి మాట్లాడాడు? ఇటీవల ప్రతిదానికి బీజేపీకి వంతపాడుతూ అతని చేష్టలు అలానే ఉన్నాయని ,కావలని హిందువులను రెచ్చగోట్టెది సనాతన ధర్మ సిద్ధాంతమా?లేక ఊసరవెల్లి సిద్ధాంతమా? అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొదటినుండి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ అంటే ఆ మూడు అక్షరాలా అర్ధం బాబు,జగన్,పవన్ అని చెబుతూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ళు ముగ్గురూ కీలు బొమ్మలని అంటున్నామని, అది నిజమని నిన్నటి పిఠాపురం జన సేన సభ నిరూపించిందని తులసి రెడ్డి అన్నారు.తనకు పదవి పిచ్చి లేదని,సైద్ధాంతిక బలం వుందని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్య మంత్రి పదవి ఎందుకు? సోదరుడు నాగబాబుకు MLC పదవి ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లాలో దశాబ్దాలుగా అందరకి అన్నంపెట్టే కాసినాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చడమేనా మీరు వల్లించే సనాతన ధర్మం? అంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *