సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసిన పవన్.. రెండు స్థానాల్లో ఓటమిపాలయ్యారు. అయితే ఓడిన స్థానం నుంచి అది కూడా భీమవరం నుంచే ఈసారి 2024 పోటీచేస్తారని ఇటీవల భీమవరంలో పవన్ పర్యటనలో రుజువు అయినప్పటికీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తారని వార్త హల్ చల్ చేసింది. అక్కడ పోటీకి అధికార వైసిపి ముద్రగడ ను సిద్ధం చేస్తుంది.. ఇక భీమవరం వదులుకున్నారని తీవ్ర ప్రచారం జరిగింది. అయితే తోలి వార్తలు అందించే.. మన సిగ్మా న్యూస్ మాత్రం మొన్న మార్చి 9వ తేదీన ఆయన భీమవరం అసెంబ్లీ నుండి కాకినాడ లోక్ సభ స్థానం నుండి 2 చోట్ల పోటీ చెయ్యడానికి ప్యూహా రచన చేస్తున్నారని ‘భీమవరం- కాకినాడ మధ్య పవన్ ‘ముఖచిత్రాన్ని వేసి న్యూస్ వేసాము.. అదే నిజమని నేడు వాస్తవ రూపం ధరించనుంది… నేడు, మంగళవారం నాడు భీమవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రామాంజనేయులు రాక జనసేనకు చాలా కీలకం అని చెప్పుకొచ్చారు. ఈసారి ఎవరెన్ని కోట్లు పంచిన భీమవరంలో గెలుపు జనసేనదే అని ఈసారి భీమవరం వదులుకోననని గెలిచి తీరతామని ప్రకటించారు.కుబేరులు ఉండే భీమవరంలో తనపై గెలిచిన స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, రౌడీయిజం కట్టడి చేయాల్సిన అవసరం తనకు ఉందని.. అతని వల్ల కాపు కులానికి చెడ్డ పేరు వస్తుందని.. తనను అక్కడ ఇంటికి స్థలం కొనకుండా అడ్డుకొన్నారని ఆరోపించారు. గొడవలకు సై అంటే దానికి రెండింతలు సై అంటానని పవన్ ప్రకటించారు. పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ.. అందరు తాను జనసేనలో చేరుతున్నానంటే ఎమ్మెల్యే అభ్యర్థినని భావిస్తున్నారని కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ఆయనను గెలిపించే బాధ్యత తీసుకొన్నానని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. తమ నాయకుడు పవన్ కోసం ఏమి చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించారు.అంజిబాబు శాంతమూర్తి అని అందరు భావిస్తారు. మనం తిట్టిన కొట్టిన మాట్లాడడు అనుకొంటున్నారు.. ఇప్పుడు చెబుతున్నా .. పవన్ జోలికి కానీ, జన సైనికుల జోలికి ఎవరైనా దాడికి వస్తే వారిని చంపించడానికి కూడా వెనుకాడను అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అంజిబాబు
