సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అతి త్వరలో జనసేన తీర్ధం తీసుకోవడం దాదాపు ఖాయం అని.. పవన్ కళ్యాణ్ స్వయంగా అయన ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకొంటారని జరిగిన ప్రచారంకు తాజగా ముద్రగడ ఊహించని బ్రేక్ ఇచ్చారు. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం .. ముద్రగడ తన అనుచరులతో కొందరు జనసేన కీలక నేతలతో జరిపిన మేధో మధనంలో కాపులంతా కలిసికట్టుగా ఉండాలని పవన్ చెప్పటం తనకు నచ్చిందని జనసేనలోకి రావాలని పవన్ కోరితే ఆలోచన చేస్తానని ముద్రగడ చెప్పా రు. అయితే తన కుటుంబాన్ని అవమానించిన చంద్రబాబుతో మద్దతు ఉన్న జనసేనలో చేరితే తన హోదాకు భంగకరం కాబ్బటి అసలు చంద్రబాబుతో పొత్తుతో ఉండటంతో పవన్కు సీఎం పదవిపైన నిర్ణయం ఏమిటని, అసలు కాపుల సంక్షేమానికి ఈ పొత్తు తో జరిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకొకుండా జనసేన లో ఎలా చేరేది? అని ముద్రగడ స్ప ష్టత కోరారు. ఒకవేళ ఎన్నికలలో గెలిచిన తరువాత అధికారం మాత్రం కాపులకు లేకుండా ఏకపక్షంగా చంద్రబాబుకే దక్కాలంటే అందుకు జనసేనలో చేరేందుకు తాను సిద్దం గా లేనని ముద్రగడ తేల్చినట్లు సమాచారం. అసలు జనసేనకు ఎన్ని సీట్లు టీడీపీ వాళ్ళు ఇస్తారో? తేల్చుకొని పవన్ తనదగ్గరకు వస్తే ఆయనతోనే మాట్లాడుతానని జనసేన కీలక నేతలతో ముద్రగడ అన్నట్లు తెలుస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *