సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నం కు చెందిన అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. నేడు, బుధవారం జనసేనాని పవన్ కల్యాణ్ చేతుల మీదుగా వంశీ కృష్ణ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘వైసీపీలో చేరకముందే నేను పవన్ కల్యాణ్‌కు అభిమానిని. పవన్ ఆలోచనలు కు నా వంతు సహకారం అందించాలని జనసేనలో చేరాను. నేను నా సొంత పార్టీలోకి వచ్చాననే ఆనందం ఉంది. గతంలో ప్రజారాజ్యంలో నేను పని చేశాను. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్‌తో నాడు తిరిగాను. గతంలో వైసీపీ అభివృద్ది కోసం నేను కష్టపడ్డాను. ఇప్పుడు విశాఖలో జనసేన కోసం అదే డెడికేషన్‌తో పని చేస్తాను. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతాను. కొన్ని శక్తులు, కొన్ని కారణాల వల్ల వైసీపీని వీడుతున్నాను. ఇంకా చాలా మంది జనసేనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేది చాలా మంది ఆకాంక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్‌తో కలిసి నడుస్తాను. తప్పకుండా జనసేనకు అద్భుతమైన ప్రజాదరణను అందరూ చూస్తారు’’ అని వంశీ కృష్ణ పేర్కొన్నారు.
