సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి బీజేపీ తో 6 ఎంపీ సీట్ల ను ఖరారు చేసుకొని అసెంబ్లీ సీట్ల లో ఇంకా సస్పెన్సు ఉన్నపటికి ..టీడీపీ జనసేన కూటమితో బీజేపీ చేరటానికి అధికారికంగా నేడు, శనివారం అంగీకరించింది. అయితే ఈ పొత్తు నేపథ్యంలో 3 లోక్ సభ స్థానాలకు పోటీ చెయ్యవలసిన జనసేన కు ఒక ఎంపీ సీటు కోత పడింది. కేవలం 2 స్థానాలకే పరిమితం అయినట్లు సమాచారం. అసెంబ్లీ సీట్లలో జనసేన కు కేటాయించిన 24 సీట్లలో కూడా బీజేపీ కి మరో 2 సీట్ల వరకు వదులుకునే అవకాశం కనిపిస్తుంది? అయితే తాజా సమాచారం ప్రకారం.. బీజేపీ పెద్దల సూచనలతో జనసేనాని పవన్‌కల్యా ణ్ కాకినాడ లోక్ సభ కు పోటీ చేసేందుకు సిద్ధం అయినట్లు ..అక్కడ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని హామీ లభించినట్లు సమాచారం. అయితే అసెంబ్లీ కి భీమవరం నుండా ? పిఠాపురం లేదా తిరుపతి నుండి పోటీ చేస్తారో? పవన్ ఇంకా ఆలోచిస్తున్నట్లు సమాచారం.. కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెం బ్లీనియోజకవర్గాల్లో ఆరు నియోజక వర్గాల్లో కాపు ఓటర్లు చాల ఎక్కు వగా ఉన్నారు. దీంతో ఈ పార్లమెంట్ పరిధిలో తన గెలుపు సులువు అవుతుందని పవన్‌కల్యాణ్అంచనా. జనసేనకు టీడీపీ మూడు పార్లమెంట్ స్థానాలను ఇచ్చింది. వీటిలో మచిలీపట్నం , కాకినాడ, అనకాపల్లి పార్లమెంట్ సీట్లలో, ఇప్పుడు అనకాపల్లి సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది.. కాకినాడ వైసీపీ సమన్వయకర్తగా చలమశెట్టి సునీల్‌ను సీఎం జగన్ నియమించారు. ఇప్పుడు సునీల్‌నే కొపసాగిస్తారా?లేక ప్యూహాత్మకంగా ముద్రగడ బరిలోకి దిగుతారా? గతంలో కాకినాడ బీజేపీ ఎంపీగా ముద్రగడ పనిచేసిన అనుభవం ఉంది మరి.. తూర్పు గోదావరితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నుండి పోటీ ఖాయం చేస్తే 2 జిల్లాలు కవర్ చేసినట్లు అవుతుందని ఇప్పుడు జన సేన, టీడీపీలో కీలక నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థిగా పవన్ బరిలో దిగితే, ఇక రాష్ట్ర రాజకీయాలకు పవన్ దూరం అవుతారని జనసేన లక్ష్యం అది కాదని మరో వర్గం వాదన.. ఇక వేచి చూడాలి.. జనసేనాని నిర్ణయం వల్ల జరిగే పరిణామాలు ఎలాగుంటాయో?…. సిగ్మా ప్రసాద్ కాలమ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *