సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడుతున్న తరుణంలో గత వారం ఆయన భీమవరం పర్యటన హెలీప్యాడ్ కు అనుమతి లేని కారణంగా వాయిదా పడిందని రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ నెల 20 వ తేదీ ఉదయం 9 గంటలకు భీమవరం చేరుకొంటారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అడ్జక్షుడు కొటికలపూడి గోవిందరావు తెలిపారు. ఆయన 21 వ తేదీ కూడా భీమవరంలోనే ఉమ్మడి జిల్లాకు చెందిన జనసేన, టీడీపీ నేతలతో భీమవరం పట్టణ శివారులోని నిర్మలాదేవి పంక్షన్ హాలులో ( ఎక్కువ సార్లు ఇక్కడికే పవన్ వస్తారు) 2 రోజులు పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు
