సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు కార్యాలయంలో మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడుతుంది జనసేన పార్టీనేనని, జనసేన కార్యకర్త ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఆదుకుంటామని, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని, జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ 5 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ సదుపాయం ఉందని అన్నారు. అనంతరం ప్రమాద ఇన్సూరెన్స్ కింద మాత్స్యపురికి చెందిన కుప్పాల సత్యనారాయణకు రూ 50 వేలు, తోలేరుకు చెందిన పంతం పరశురామ్ కు రూ 49,600 ల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, మండల అధ్యక్షులు మోకా శ్రీను, తొలేరు సర్పంచ్ వెంకట కృష్ణ, మాత్స్యపూరి కనకయ్య, బాలాజీ, ముచ్చకర్ల శివ, ముచ్చకర్ల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
