సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం, తోలేరు గ్రామం జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త కుటుంబానికి జనసేన పార్టీ తరఫున కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాసత్తు ఎవరైనా పార్టీ కార్యకర్తలు గాయపడినా, దురదృష్టవశాత్తు మరణించినా వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ముందు చూపుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి బీమా చేయించారని అన్నారు. ఈ కుటుంబానికి అన్ని విధాలుగా జనసేన పార్టీ అండ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మల్లినిడి తిరుమల రావు, ఉండి ఇంఛార్జి జుత్తిగ నాగరాజు, మండల ZPTC గుండా జయప్రకాష్ నాయుడు, తొలేరు గ్రామ ప్రెసిడెంట్ వెంకటకృష్ణ , వైస్ MPP అడ్డాల రాము, మండల Mptc లు గుల్లిపల్లి విజయలక్ష్మీ, యాళ్లబండి ఇందిరా, వర్ధినీడి వెంకటలక్ష్మి , చిలకంపాటి ప్రకాశం,ప్రెసిడెంట్ కారేపల్లి శాంతి ప్రియ,భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, పట్టణ సెక్రటరీ సుంకర రవి, మండల సెక్రటరీ కత్తుల నీలేంద్ర,భీమవరం మండల MpTC లు తాతపూడి రాంబాబు, అరేటి వాసు,నాయకులు ఇరింకి రాము, మాజీ కౌన్సిలర్ వాణపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *