సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా అందిన సమాచారం ప్రకారం నేడు.. మంగళవారం . జనసేన పార్టీకి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గాజు గుర్తును కేటాయించింది. ఈ ఏడాది గత మే నెలలో దేశవ్యాప్తం గా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గుర్తును మళ్లీ కేటాయించింది. దీంతో ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు కు బాగా అలవాటయిన గాజు గ్లాస్ గుర్తు తిరిగిరావడం తో పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సహం వచ్చింది.
