సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నిన్న నేడు, వివిధ జిల్లాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ పార్టీ క్యాడర్ నుద్దేశించి భీమవరం పర్యటనకు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం నియంతృత్వంగా అడ్డంకులు కలిగించింది అని ఆరోపించారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నామని ఆయా జిల్లాల నేతలను పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనితో భీమవరం నుండి జనసేన కీలక నేతలు ఆయనతో సమావేశం అయ్యారు. వారితో మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారు. ఈ లోగానే బహుశా రేపు శుక్రవారం బీజేపీ తో పొత్తు ఖరారు ఫై విషయం తేలిపోయే అవకాశం ఉంది. ఆ విషయం తేలగానే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల మీదుగా రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు అని సమాచారం. . అలాగే పొత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కళ్యాణ్ సమీక్షలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *