సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశం మంగళగిరిలో నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు పాల్గొన్నారు. దీనిలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అడ్జక్షుడు కొటికలపూడి చినబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు, సెల్ ఛైర్మన్లు లతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తిరుమల లడ్డు లో అసలు నెయ్యి వాడలేదని అంతా పామాయిల్ కెమికల్స్ అని సిట్ నివేదికలో ఉందని..అయితే సోషల్ మీడియాలో తనపై తిరుమల లడ్డు తదితర విషయాలపై తనపై వైసీపీ వాళ్ళు చేస్తున్న దారుణమైన ట్రోల్స్, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు జనసేన నేతలు తగిన స్థాయిలో కౌంటర్ ఇవ్వడం లేదని అన్ని నేనే చేసుకోవాలా ? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆరవ ఫై విచారణ జరిపి తప్పు చేస్తే తగిన చర్యలు తీసుకొంటామని వ్యాఖ్యానించారు. పార్టీలో నేతలు చైతన్యవంతంగా ఉండాలని ఆదేశించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *