సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అతి త్వరలో జనసేన కు సేనానిగా నిలిచి అనేక త్యాగాలు చేసిన నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు లేఖ పరంగా ఆమోదం తెలిపిన..2 శాఖలు కేటాయిస్తారని వార్తలు ప్రచారంలో ఉన్నపటికీ.. ఇప్పటికి ఆయన మంత్రి పదవిపై వివరణ లేదు. నిజానికి ప్రజా ప్రతినిధి గా ఎమ్మెల్యే పదవి లేకపోయినా ఎమ్మెల్సీ కాకపోయిన సీఎం కాబినెట్ లో 6 నెలలు పాటు మంత్రిగా కొనసాగే అవకాశం రాజ్యాంగంలో ఉంది. తదుపరి ఎదో పదవి సాదించవలసి ఉంది. మరి ఇటీవల నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడమే తరువాయి అనుకున్నారు అంతా .. దీనిపై టీడీపీ పార్టీలో, బీజేపీ సీనియర్స్ ఎమ్మెల్సీ,మంత్రి పదవి ఆశిస్తున్నా ఆశావాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం తో .. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే లేదా నాగబాబు ప్రమాణస్వీకారానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. చాలామంది మంత్రి పదవిని ఆశిస్తుండటంతో నాగబాబును ఎమ్మెల్సీగా చేయకుండానే మంత్రిని చేస్తే మరింత అసంతృప్తి రావొచ్చని అధిష్టానం భావిస్తోంది. ఇక త్వరలో వచ్చే ఏడాది మార్చి 30 తర్వాత 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఇందులో ఒక దాన్ని నాగబాబుకు కేటాయించి తదుపరి కొత్త తెలుగు సంవత్సరం ఉగాది వేళ మంత్రిగా ప్రమాణస్వీకారం? చేసే అవకాశం అయితే జరిగే అవకాశం ఉంది.
