సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భారీ విరాళాన్ని అందించారు. నేడు, మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి. రత్నంకి విరాళం చెక్కులను అందజేశారు. పవన్ మాట్లాడుతూ.. జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.10 కోట్లను అందజేస్తున్నాను. ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. జనసేన పార్టీ ప్రయాణానికి ధనవంతులు తో పాటు సగటు కూలి తన చిన్నపాటి సంపాదనలో రూ. వంద పక్కన పెట్టి పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పాడుతున్నారు. అన్నారు. పిఠాపురం లో 3 రోజుల పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం… అయితే ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబ్బటి కేంద్ర బీజేపీ పెద్దల సూచనతో.. పవన్ కాకినాడ పార్లమెంట్ కు పోటీ చెయ్యడం ఖాయం అని బలంగా వినిపిస్తుంది..చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *