సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిరి లో జరుగుతున్నా జనసేన పార్టీ సమావేశాలలో.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పార్ట్ బాధ్యతలు అందజేశారు. అగ్ర సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంతో బంధుత్వం , మంచి సాన్నిత్యం ఉన్న బన్నీ వాసు ఇప్పటి వరకు జనసేన కు పశ్చిమ గోదావరి జిల్లాలో మద్దతు దారుడుగా ఉన్నారు. సినిమాల నిర్మాణంలో వాటి విజయాలు సాధించే ప్రక్రియలో మంచి నిష్ణాతుడుగా పేరు తెచ్చుకొన్నారు బన్నీ వాసు.. పవన్ కళ్యాణ్ ఆయనకు జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ గా నియామక పత్రం అందజేస్తూ.. ఇకపై జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజలలోకి చొచ్చుకొని పోయేలా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రచార చిత్రాలు, కార్యక్రమాలు రూపొందించి పార్టీకి సేవలు అందించాలని వ్యాఖ్యానించారు.
