సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పోడూరు పోలీస్ స్టేషన్ నుండి విడుదలయ్యాక నేటి గురువారం మధ్యాహ్నం జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) భీమవరంలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లెక్సీలు ద్వారా విద్వేషాలు వస్తాయ్ అని ముందే చెప్పామని, మేము కూడా ఒక పోస్టర్ వేయాలని అనుకున్నామని, ప్రభుత్వ అవినీతిపై ఒక్క ప్లెక్సీ వెయ్యగానే ఉదయం 5.30 లకు పోలీసులు వచ్చి తనను అరెస్ట్ చేశారని, దీనినే పెత్తందారీ అంటారని అన్నారు. ఒక్క ప్లెక్సీ వేశాం.. దానికే దైర్యం లేకపోతే ఎట్లా .. పోలీసులు ఉద్యోగాలు చేయాలి గానీ.. ఓవర్ యాక్షన్ చేయవద్దని అన్నారు. ..కరెంట్ డీజిల్, నిత్యావసర వస్తువులు, దాన్య బస్తాలు దొబ్బుతున్నది ఎవరు? ఓటుకు రూ 3 వేలు ఇస్తామని చెబుతుంది .. మీరే కదా? అని ప్రశ్నించారు. పేదవాడి మధ్యతరగతి ఆదాయ వనరులన్ని పోగొట్టి పెత్తందారీ చేస్తుంది వైసిపి పాలకులే అని అన్నారు. ప్లెక్సీలకు లా అండ్ ఆర్డర్ అంటూ పోలీసులు కాపల కాయడం ఏమిటి, పద్దతి మార్చుకోండి .. జనసేన పోరాటం చేస్తే .. తట్టుకోలేరని హెచ్చరించారు. చినబాబు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) చినబాబుకు సంఘీభావంగా స్వయంగా వచ్చి పలకరించారు. కార్యక్రమంలో పార్టీ PAC సభ్యులు కనకరాజు సూరి, తాడేపల్లిగూడెం ఇన్ ఛార్జ్ బొలిశేట్టి శ్రీనివాస్, నరసాపురం ఇన్ ఛార్జ్ బొమ్మిడి నాయకర్, తణుకు ఇంఛార్జి విడివాడి రామచంద్రరావు, ఉండి ఇంఛార్జి జుత్తిగ నాగరాజు, ఏలూరు ఇంఛార్జి రెడ్డి అప్పలనాయుడు, భీమవరం పట్టణ అధ్యక్షుడు చెన్నమల్ల చంద్రశేఖర్, తిరుమల బాబీ మరియు మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు,జనసైనికులు, వీర మహిళలు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు..
