సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రక్తదానం చేయడం ద్వారా దాతల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని, యువతలో మానవతా విలువలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం మండలం రాయలంలో జనసేన పార్టీ పట్టణ సెక్రటరీ పత్తి హరివర్ధన్ అధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ ప్రతిరోజూ రక్తం అవసరం ఉండి ఎంతోమంది ఇబ్బందులకు గురౌతున్నారని, ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పాట్లు పడుతున్నారని, రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ప్రతి రక్తపు బొట్టు విలువైనదని, రక్త దానంపై అపోహలు వీడాలన్నారు. అనంతరం 125 మంది స్వచ్చందంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్స్ అందించారు. కార్యక్రమంలో రాయలం జనసేన పార్టి నాయకులు, గ్రామస్తులు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు.
