సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు ఎన్నో అడ్డంకులు అధిగమించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు (Nagababu) పేరు ఖరారైంది. ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు పవన్. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. తగిన బలం లేని వైసీపీ అభ్యర్థులు ఎవరు నామినేషన్ వెయ్యకపోతే నామినేషన్ పర్వము ముగియగానే..ఈనెల లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు గెలుపు నల్లేరుమీద నడకే కాబట్టి రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారానికి జనసేన క్యాడర్ సందడి ఇప్పటి నుండే ప్లాన్ చేస్తున్నారు.
