సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిరిలో జనసేన కార్యాలయంలో నేడు, శుక్రవారం పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో సమీక్షలు నిర్వహించారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఫై పొత్తు తో జనసేన ఎన్నికలకు వెళుతుందంటే బీజేపీ ని వదిలేస్తుంది అని వైసిపివాళ్ళు ప్రచారం మొదలు పెట్టారు. దీనిని ఖండిస్తున్నాను. ‘మేం (జనసేన) ఎన్డీఏలో ఉన్నాము. ఆ రోజు కూటమి సమావేశానికి కూడా హాజరయ్యాం. 2014 తరహాలోనే 2024 ఎన్నికలలో పొత్తులు ఉండాలనేది నా ఆకాంక్ష. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది నా అభిప్రాయం. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారు. చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసి మద్దతు ఇచ్చాను. అయితే కేంద్ర పెద్దలతో సంప్రదించకుండా పొత్తు ప్రకటించాను. ఇప్పటికీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది నా అభిమతం. మాతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందని ఇప్పటికీ భావిస్తున్నాం. గతంలోనే జనసేన, బీజేపీ సమన్వయం కోసం కమిటీలు ఉన్నాయి. ఇదే విధంగా ఇప్పుడు టీడీపీ, జనసేనలను సమన్వయం చేసేలా కమిటీ వేశాం. మా తరపున జనసేన కమిటీలో మహేందర్ రెడ్డి, దుర్గేష్, భీమవరం కు చెందిన కొటికలపూడి గోవిందరావు(చినబాబు) , యశస్విని, నరసపురానికి చెందిన బొమ్మిడి నాయకర్‌లు సభ్యులుగా నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుంది’ అని పొత్తులు, సమన్వయ కమిటీల గురించి పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన వారాహి 4వ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది అన్నారు. . వైసీపీ ప్రభుత్వం చేతకానితనం కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు జీవితాలు దుర్భరంగా మారాయి. రైతులు, చేనేత కార్మికులు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకొన్నారు అని పవన్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *