సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం శ్రీరాంపురం గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా. పర్యటిస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనను విమర్శిస్తున్న జనసేన నేతలనుద్దేశించి మాట్లాడుతూ.. నా భీమవరం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో, ఇచ్చిన సంక్షేమ పధకాలు ఏమిటో? స్థానిక ప్రజలు చెబుతారు. జన సైనికులు రాష్ట్రంలో ఎక్కడ చుసిన భయానిక వాతావరణాన్ని కల్పించే విధంగా వ్యవహరిస్తున్నారని, వారు సమాజంలో దాడులకు పాల్పడితే వారిని అరెస్టు చేయకుండా సన్మానిస్తారా?వారు అమాయకులా ? అందరు చూసారుగా! మంత్రులపై సైతం దాడి చేస్తున్నారంటే వారి నుండి సామాన్యులకు రక్షణేది ?ఎంత ప్రమాదకరంగా తయారయ్యారు? చట్టం అందరికీ ఒకటే.గత మూడు సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రజలకు ఒక లక్ష 35 వేల కోట్ల నిధులను ప్రజలకు అందించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రజలకు అందించలేదు. అయితే రాష్ట్ర ప్రజలకు మేలు జరగకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కుట్రలు చేస్తూ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే విధంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా జన సైనికులు రాష్ట్రంలో భయానిక వాతావరణాన్ని కల్పించే విధంగా వ్యవహరిస్తున్నారని, వారు సమాజంలో హానికరంగా ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకొనిపోతుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *