సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 27 ఏళ్ళు తరువాత ఢిల్లీ రాష్ట్రాన్ని సాధించిన బీజేపీ శ్రేణులలో ఉత్సహం అంతాఇంతా కాదు..ఇదో గేమ్ చేంజెర్ విజయం.. గతంలో ఎప్పుడు లేనంత బలంగా బీజేపీ ఎక్కువ రాష్ట్రాలలో సత్తా చాటింది.కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలహీనపడింది.ఇకపై భారత్ లో తన అసలు సిసలు భారతీయతత్వంతో కూడిన చట్టాలు, సంస్కరణలు చెప్పట్టడానికి ఇదే మంచి సమయంగా బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే శరవేగంగా జమిలి ఎన్నికల చట్ట ప్రతిపాదన పార్లమెంట్ లో పరిశీలనకు పెట్టిన బీజేపీ మేధావులు ..దేశంలో లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాలలో ఒకేసారి 2027లో ‘జమిలి ఎన్నికలు’ నిర్వహించి ఇదే ఊపు కొనసాగించగలిగితే.. హిందూస్తాన్ లో కాషాయ జెండా స్తానం సుస్థిరం చేసుకొనే దిశగా బీజేపీ పెద్దలు చేస్తున్న కృషి ఫలించే రోజు? ఎంతో దూరంలో లేదని అనిపిస్తుంది. జమిలి ఎన్నికలు చట్టం కావడానికి పార్లమెంట్ లో మూడింట 2వంతుల మెజారిటీ కూడా సాధించే పూహ్యం కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. అయితే దక్షిణ భారతంలోని కీలకమైన ఐదు పెద్ద రాష్ట్రాలకు ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో NDA యేతర పార్టీలే పాలిస్తున్నాయి. అయితే తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ స్వంత బలం పెరిగింది. నార్త్ ఈస్ట్‌లో మిజోరం తప్ప అన్ని బీజేపీ, ఎన్డీఏ రాష్ట్రాలే. పుదుచ్చేరి కూడా ఎన్డీఏ ఖాతాలో ఉంది. అయితే అనూహ్యంగా తాజగా .. ఢిల్లీ కూడా బీజేపీ ఖాతాలో పడడంతో.. 15 రాష్ట్రాలకు పెరిగింది బీజేపీ అధికారం. NDA కాకుండా పూర్తీ స్వంత బలంతో బీజేపీ 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది అని గమనించాలి. ఎన్డీఏ కూటమితో కూడా కలుపుకుంటే.. దేశంలో మొత్తం 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అంటే ఒకరకంగా మొత్తం 28 రాష్ట్రాలలో మూడింట 2వంతుల రాష్ట్రాలలో పరోక్షంగా బీజేపీ బలం కనిపిస్తుంది. 2027 లో దేశంలో 20 కోట్ల పైగా జనాభ కలిగిన ఉత్తర్ ప్రదేశ్ , రాజస్థాన్ లలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోడీ 74 ఏళ్ళ వయస్సులో ప్రాభవం పెరిగిన ఈ తరుణం ఇదే అదనుగా జమిలి ఎన్నికలకు బీజేపీ సిద్ధం కాకపోతే.. ఆలస్యం చేస్తే నిజానికి భవిషత్తు లో ఇటువంటి అవకాశం రాకపోవచ్చు.. సిగ్మా’ ప్రసాద్ కాలమ్స్..
