సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జమ్ము కాశ్మీర్ లోని ఫరీదాబాద్‌ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ లో గత శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 9 మంది దుర్మరణం చెందగా.. 27 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఢిల్లీ బాంబు పేలుళ్లకు ముందు ఫరీదాబాద్‌లో ఇటీవల స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల శాంపిల్స్‌ను అవి టెర్రరిస్టులు ఏ రసాయనాలుతో తయారుచేస్తున్నారో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తుండగా ఉహించనివిధంగా పేలుడు జరిగింది. వారి శరీరభాగాలు ముక్కముక్కలు అయ్యాయి. కానీ దేశ సేవలో అమరవీరులు అయ్యారు. ఈ ఘటనపై జమ్ము కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ స్పందించారు. ప్రమాదానికి సంబంధించి పలు విషయాలను నేటి ఉదయం మీడియాకు తెలుపుతూ .. ఇది ఎవరిదాడి కాదని ఇదొక దురదృష్ట ఘటన. దీనిపై ఎలాంటి ఊహగానాలు చేయవద్దు.అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *