సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మూడు విడతలుగా నిర్వహించిన జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు, మంగళవారం ఉదయం నుండి వెలువడుతున్నాయి. గతానికి బిన్నంగా ఓటింగ్ శాతం ఏకంగా సుమారు 60 శాతం రావడం.. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణలో ఎన్డీయే సర్కార్ సాధించిన ఘన విజయం కాగా.. దశాబ్దం తర్వాత ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఓటరు ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ జోడీకే జై కొట్టాడు.90 సీట్ల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ అయిన 46 సీట్ల కు ఇండియా కూటమి ఇప్పటికే( మధ్యాహ్నం 12 గంటల సమయంలో) సాధించింది. 52 సీట్లలో కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీకి ఇక్కడ 21 స్థానాలలో లీడింగ్ లో ఉంది.మిగతా పార్టీలు 5స్థానాలలో ఆధిక్యతలో ఉన్నారు.
