సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! సైరన్లు మోగుతున్నాయి! సరిహద్దు ప్రాంతాల్లో గత రాత్రి చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి!పాక్ నాసిరకం మిసైల్స్ కు భారత్ లోని లక్ష్యాలు కనపడకుండా జమ్మూ కాశ్మిర్, పంజాబ్ లలో పూర్తీ కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్థాన్ గత గురువారం రాత్రి 7 గంటల నుండి భారత్ లోని సరిహద్దు ప్రాంతాలలోని భారత్ ఆర్మీ శిబిరాలు మరియు ప్రధాన 15 నగరాలూ, అమృతసర్ స్వర్ణ దేవాలయం, కాశ్మిర్ లోని వైష్ణో దేవి దేవాలయం లక్ష్యంగా రాకెట్లు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది.అయితే వాటిలో ఒక్కటి లక్ష్యం చేరకుండా భారత్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని సమర్థంగా, సంపూర్ణంగా అడ్డుకుంటున్నాయి. పఠాన్‌కోట్, జమ్ము నగరం, జమ్ము యూనివర్సిటీ వద్ద ఉధంపూర్‌లో మూడు పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. 3 జెట్ విమానాలను కూల్చివేసి వాటిలో పైలట్ లను బందీలుగా పట్టుకొన్నారు. ఇక గత రాత్రి నుండే భారత్ త్రివిధ దళాలు పాకిస్తాన్ లోని అన్ని ప్రధాన నగరాలూ, సైనిక క్యాంపులపై ఆపరేషన్ సుదర్శన్ చక్ర పేరుతొబాంబు దాడులతో విరుచుకుపడి తీవ్ర విద్వంసం తో వారికీ ఈ రాత్రి బ్రతికితే చాలు అన్న రీతిలో కాళరాత్రి కనపడేలా చేసింది.భారత్ సైన్యం సాహసానికి త్యాగానికి శాల్యూట్
