సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత అంతరిక్ష కీర్తి కిరీటంలో మరో వజ్రం గా నేడు, శనివారం మరో అద్భుతం సాధించింది. చంద్రయాన్ ఘన విజయంతో.. ప్రపంచం అంతా ఇండియా ‘ఇస్రో ‘వైపు చూస్తుండగానే ఈసారి ఏకంగా నిప్పులు కక్కే సూర్య గ్రహము ఫై పరిశోధనలు కోసం షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా 11.50 గంటలకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ ప్రయోగం జరిగింది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ దిగ్విజయంగా దూసుకెళ్లింది. 63 నిమిషాల పాటు 235 కి.మీ దూరం నింగిలోకి ప్రయాణించిన అనంతరం భూ స్థిర కక్ష్యలోకి ఆదిత్యా ఎల్-1 శాటిలైట్‌ని పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రవేశపెట్టనుంది. మిషన్ ఆదిత్య ప్రయోగానికి సుమారు రూ.378 కోట్లు ఇస్రో వెచ్చించింది. ఇది చాల చిన్న బడ్జెట్ .. కానీ ప్రయోగం మాత్రం అనితర సాధ్యం.. షార్‌లో మిషన్ ఆదిత్య విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు గట్టి ధీమాతో ఉన్నారు. ఈ సాటిలైట్ కక్ష్య భూమికి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ కక్ష్యను చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *