సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా అందరి నిరీక్షణ ఫలించింది. చంద్ర గ్రహం పరిశీలనకు కేవలం ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లి ఊహించని రీతిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)లో చిక్కుకుపోయిన నాసా అంతరిక్ష వ్యోమగాములు ఇద్దరు మీద దాదాపు అందరు ఆశలు వదులుకునే పరిస్థితి వచ్చింది. మహిళగా 59 ఏళ్ళ వయస్సులో సునీతా చేసిన సాహసం చూపిన మనో నిబ్బరం యువత కు ఆదర్శం.. అయితే 9 నెలలు తరువాత ఆధునిక సాంకేతిక ప్రయోగంతో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు చేరుకున్నారు. నేటి బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర జలాల్లో వ్యోమగాములు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఫ్రీడమ్ వారిద్దరినీ సురక్షితంగా భూ వాతావరణంలోకి తీసుకువచ్చి ల్యాండ్ చేసింది. అప్పటికే సముద్రంలో వారి కోసం ఎదురుచూస్తున్న సహాయ బృందాలు వారిని క్యాంపుల్స్ నుంచి బయటకు తీశారు. ల్యాండింగ్ అనంతరం సునీత, విల్మోర్ను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. స్పేస్ లో ఉండగానే సునీతా విలియమ్స్ ను అబినందిస్తూ భారత్ కు ఆహ్వానించారు ప్రధాని మోడీ.
