సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీ ప్రజలు ను భయపెట్టిన మాండూస్ తుపాను తీరాన్ని దాటి మూడు రోజులవుతున్నా రాష్ట్రంలో ఇంకా వర్షాలు కొనసాగుతున్నా యి. దక్షిణ కోస్తాం ధ్ర, రాయలసీమల్లోవానలు కురుస్తూనే ఉన్నాయి. గాలిలో తేమ అధికంగా ఉండడం వల్ల వర్షాలు పడుతున్నాయని, తాజగా గుంటూరు మొదలు రాయలసీమా వరకు ఆయా జిల్లాలలో గాలిలో తేమ 90–95% నమోదవుతోంది అని దీనితో అనారోగ్యవంతులు పెద్ద వయస్సు వారు, పిల్లలు అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉంటె మంచిది అని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రం పైకి ఈశాన్య , తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుం చి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోకొన్ని చోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో నేడు, మంగళవారం, రేపు బుధవారం అక్కడక్క డా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎం డీ) ప్రకటించింది.
