సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం భారతీయ విద్యాభవన్స్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఆర్చరీ, ఫెన్సింగ్, క్రీడల్లో గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించిన సందర్భంగా విద్యార్థుల అభినందన సభ ఈరోజు టౌన్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రైస్ మిల్లర్ అసోసియేషన్ భవన్ లో నిర్వహించారు. ఈక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు, జాతీయ స్థాయిలో క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందచేశారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకు రావాలని, వీరిని తీర్చి దిద్దిన గురువులను, ప్రోత్సహించిన తల్లితండ్రులను అభినందించారు.
