సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి ఉండి వెళ్లే దారిలో ఉన్న ఫంక్షన్ హాల్లో నేడు, శుక్రవారం ఉదయం జాతీయ స్థాయి ఆక్వా వ్యవసాయ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ నాగరాణి తో కలసి స్థానిక ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు ఎంపీ బీదా మస్తాన్ రావు కల్సి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ స్థాయి రాష్ట్రా స్థాయిలో విచ్చేసిన ఆక్వా రైతులు ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆక్వా వ్యవసాయానికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం వివరించారు. ఎగ్జిబిషన్ లో ఏర్పటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి ఆధునిక ఆక్వా వ్యవసాయ పద్ధతులు, పనిముట్లు , మిషన్ లు ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ నిర్వాహకులను అభినందించారు.
