సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బి.వి. రాజు. ఐ. టీ కాలేజ్, నర్సాపూర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విష్ణు నేషనల్ కాంక్రీట్ కానోయి కాంపిటీషన్ -2025 నందు కాంక్రీట్ కానోయి రేసులో ( నీటిలో కాంక్రీట్ పడవల పోటీ )ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు తృతీయ బహుమతిని భీమవరం విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ విద్యార్థులు సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు తెలియచేశారు, ఈ కాంపిటీషన్ లో దేశవ్యాప్తంగా మొత్తం 16 టీమ్స్ పాల్గొన్నాయి అని, ఫైనల్ రౌండ్లో వివిధ విభాగంలో అయిన ఎండూరెన్స్ రేస్ లో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థులు యం. షాలీం రాజు ,యల్.మాణిక్యం నాయుడు, యస్. యశస్విని,ఆర్.దీప్తి,బి.యశ్వంత్, సి.పవన్ వెంకట శివ కుమార్, మన్యూరబిలిటీ రేసులో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థులు పి.మౌని సాయి, ఏ.రోహిత్ సాయి రెడ్డి,కె.సాయి కృష్ణవేణి,వి.ఫణి సాయి గాయత్రి, జె.నాగ గణేష్,కె.వాసవి దేవి మరియు ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థులు పి.లిఖీదర్ నాయుడు,యం. నొవాహు కుమార్, షేఖ్ చేషుమియ,బి.చిన్న,బి.హేమలత, యన్.పవిత్ర, స్ప్రింట్ రేసులో తృతీయ బహుమతులతో తమ విద్యార్థులు ప్రతిభ కనబరించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు వారిని కాలేజ్ బృందం అభినందించారు.
