సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం నుండి తిరుపతిలో లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా నేతృత్వంలో రెండు రోజుల పాటు ఎంతో ప్రతిష్టాకరంగా జరుగనున్న “మొదటి జాతీయ పార్లమెంటరీ మరియు లెజిస్లేటివ్ మహిళా కమిటీ సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి తో సహా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుండి మహిళా నేతలు ప్రజా ప్రతినిధులు పాల్గొనగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర హోమ్ మంత్రి అనితా తదితర మహిళా నేతలు పాల్గొన్నారు. రఘురామా తన ప్రసంగంలో..ఈ సమావేశం తిరుపతిలో జరగటం తనకు ఆనందదాయకం అని మహిళలు అంటే తనకు ఎనలేని గౌరవం అని.. అయితే ఎన్నో త్యాగాలతో మహిళా ప్రజా ప్రతినిధులగా ప్రజా సేవలో ముందున్న వారి పట్ల.. ఎంతో పట్టుదల కృషి తో ఈ దేశంలో రాష్ట్ర పతి ద్రౌపతి ముర్ము మొదలుకొని ఎంతో విశిష్ట స్థానాలకు ఎదిగిన మహిళామణుల పట్ల మరింత గౌరవం అని, వారి స్ఫూర్తి తనను ప్రజా సేవలో ఉత్తేజితుడిని చేస్తుందని, గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళలకు ఎన్నో అవకాశాలు స్వేచ్ఛ వచ్చిందని మహిళలు అన్ని రంగాలలో అవకాశాలు సద్వినియోగం చేసుకొంటున్నారని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *