సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలోని తోలేరులోని సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్ నిర్వహించిన 19వ జాతీయ స్థాయి నాటికల పోటీల ముగింపు సందర్భంగా గత రాత్రి సుప్రసిద్ధ టివి మరియు సినీనటుడు సుబ్బరాయశర్మను ఘనంగా సన్మానించారు. నాలుగురోజులపాటు నిర్వహించిన నాటికల్లో ఉత్తమ ప్రదర్శనగా ‘నాన్నా నేనొచ్చేస్తా’ నాటిక ఎంపికైంది. నాటికపోటీల వివరాలను కళాపరిషత్ అధ్యక్షుడు చవాకుల సత్యనారాయణమూర్తి, న్యాయ నిర్ణేతలు వంగా నర్సింహారావు, గంటా రామ్మోహానరావు, మానాపురం సత్యనారాయణ తెలిపారు. 18 విభాగాలలో అవార్డులను ఎంపికచేశామన్నారు. ఉత్తమ ప్రదర్శనగా గుంటూరుకు చెందిన అమృతలహారి ఆర్ట్స్ నాన్నా నేనొచ్చేస్తా, ద్వితీయ, తృతీయ ఉత్తమ ప్రదర్శనలుగా కరీంనగర్ చైతన్య కళాభారతి చీకటిపువ్వు, గోరువంక వారి కొత్తపరిమళంకు దక్కాయన్నారు. పసుపులేటి నాగేశ్వరరావు కళాప్రాంగణ వేదికపై రాత్రి బహుమతి ప్రదానం చేశారు.
